News February 25, 2026

కార్మికులకు గుడ్ న్యూస్: 40 దాటితే హెల్త్ చెకప్!

image

40 ఏళ్లు దాటిన కార్మికులందరికీ ఇకపై ఫ్రీ మెడికల్ టెస్ట్‌లు తప్పనిసరి కానున్నాయి. ESIC 75వ వేడుకల్లో మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయం చెప్పారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచి రిఫరల్స్ తగ్గించాలని అధికారులకు సూచించారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకంతో ESICని అనుసంధానించేలా ఒప్పందం చేసుకున్నారు. కార్మికుల ఆరోగ్యం బాగుంటేనే దేశం బాగుంటుందని, ESIC సేవలు ఎయిమ్స్ (AIIMS) స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.

Similar News

News April 14, 2026

1,000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

image

పంజాబ్&సింధ్ బ్యాంకులో 1,000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. TGలో 30 పోస్టులున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, ఏదైనా బ్యాంకులో 18 నెలల పని అనుభవం ఉండాలి. సంబంధిత రాష్ట్రంలోని లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. వయసు 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ APR 20. మరిన్ని వివరాలకు punjabandsind.bank.in చూడండి.

News April 14, 2026

BSNLలో 120 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు

image

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణకు ఏప్రిల్ 16-23 వరకు అవకాశం ఉంటుంది. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: bsnl.co.in చూడండి.

News April 14, 2026

ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఛార్జీలు తగ్గింపు!

image

ఏపీలో తిరిగే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను సవరించినట్లు అధికారులు తెలిపారు. గతంలో TG బస్సుల్లో దూరాన్ని బట్టి ఛార్జీలు రూ.20-130 అధికంగా ఉండేవి. ఇకపై వాటిని తగ్గించి APSRTC ఛార్జీల మేరకే వసూలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి రోజూ విజయవాడ, తిరుపతి, కర్నూలు, విశాఖకు వందలాది తెలంగాణ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే.