News May 11, 2024
కార్మికులకు మే 13న వేతనంతో కూడిన సెలవు

మే 13వ తేదీన జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు, గుంటూరు జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ శ్రీనివాస్ కుమార్ శుక్రవారం తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని షాపులు, హోటల్లు, సినిమా హాల్స్, వాణిజ్య సంస్థలో పనిచేసే కార్మికులకు, ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు సెలవు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 18, 2025
గుంటూరులో పడిపోయిన చికెన్ ధరలు

బర్డ్ ఫ్లూ ప్రభావంతో గుంటూరు నగరంలో కూడా చికెన్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల క్రితం ఇతర జిల్లాలతో పోల్చుకుంటే గుంటూరు నగరంలో రూ.25 ఎక్కువగా విక్రయించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రజలు మటన్, చేపల కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో చికెన్ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో గుంటూరు చికెన్ వ్యాపార దుకాణాల సంఘ సభ్యులు కేజీ రూ. 100కి విక్రయించాలని నిర్ణయించారు.
News February 18, 2025
గుంటూరు: పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు మార్చి 6 నుంచి 12 వరకు పరీక్షలు జరగనున్నట్లు వర్సిటీ పరీక్షల నిర్వహణ నియంత్రణ అధికారి ఆలపాటి శివ ప్రసాదరావు పేర్కొన్నారు. సోమవారం టైం టేబుల్ ఆయన విడుదల చేశారు. రెగ్యులర్, సప్లిమెంటరీ, స్పెషల్ ఏడ్యుకేషన్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ 1,2,3 పేపర్లకు 2 నుంచి 3:30 వరకు 4,5,6 పేపర్లకు పరీక్షలు ఉంటాయన్నారు.
News February 18, 2025
దరఖాస్తులను 20 నాటికి అందించాలి: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్‌లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రిసైడింగ్ అధికారులు నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులను ఈనెల 20 నాటికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరే విధంగా అందించాలన్నారు.