News July 30, 2024
కార్మికుల సమస్యలు పరిష్కారానికి మంత్రి హామీ

కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు. మంగళవారం విశాఖలో కార్మికుల సమస్యలపై ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, పీఎఫ్, పీఎస్ఐ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం వివిధ కార్మిక సంఘాల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. త్వరలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.
Similar News
News July 10, 2025
కైలాసగిరిపై కొత్త ‘రోప్ వే’ ప్రాజెక్టు

కైలాసగిరిపై కొత్త ‘రోప్ వే’ను V.M.R.D.A. నిర్మించనుంది. ప్రస్తుత రోప్ వే పాతబడింది. ప్రయాణ వ్యవధి తక్కువ. దీంతో కొత్త దారిలో ‘రోప్ వే’ను ప్రతిపాదించామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. దీని ద్వారా బే ఫ్రంట్, విశాఖ నగరం, కొండల దృశ్యాలను త్రీ డైమెన్షనల్ వ్యూలో చూడొచ్చు. సుమారు 1.5 కిలోమీటర్ల పొడవైన ప్రయాణం ఉంటుంది. కార్ పార్కింగ్, ఇతర దర్శనీయ స్థలాలను ఈ రోప్ వే అనుసంధానం చేస్తుంది.
News July 10, 2025
మత్యకారులకు రాయితీపై బోట్లు, ఇంజిన్ల సరఫరా

‘జాతీయ ఫిష్ ఫార్మర్స్ డే’ని పురష్కరించుకొని గురువారం పెదజాలరిపేటలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మత్స్యకారులకు 55 ఇంజిన్లు సరఫరా చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు చేతుల మీదుగా వాటిని అందించారు. రూ.45.81 లక్షలు విలువ కలిగిన ఇంజిన్లకు ప్రభుత్వం రూ.18.32 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. నియోజకవర్గంలో బోట్లు, ఇంజిన్లు, వలలు కావలసిన జాలరులకు 40% రాయితీపై సరఫరా చేస్తామన్నారు.
News July 10, 2025
పిల్లల లక్ష్య సాధనలో తల్లిదండ్రుల తోడ్పాటు చాలా అవసరం: కలెక్టర్

పిల్లల లక్ష్య సాధనలో తల్లిదండ్రుల తోడ్పాటు చాలా అవసరమని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. మెగా పేరెంట్స్&టీచర్స్ మీటింగుల్లో భాగంగా చినగదలి జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి పాల్గొన్నారు. చిన్నారులకు వారి తల్లిదండ్రులు రోజూ ప్రత్యేక సమయం కేటాయించాలని, పాఠశాల నుంచి వచ్చాక ఉత్తేజపరచాలని సూచించారు.