News August 18, 2024
కార్యకర్త పాడె మోసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

రేణిగుంట మండల టీడీపీ సీనియర్ కార్యకర్త, యూనిట్ ఇన్‌ఛార్జ్ మునెయ్య అంత్యక్రియలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరయ్యారు. అంతియ యాత్రలో ఆయన పాడె మోసి కడసారి వీడ్కోలు పలికారు. శ్మశాన వాటిక వరకు మోసి సానుభూతి తెలిపారు. మంచి కార్యకర్తను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Similar News
News December 23, 2025
నగరిలో టీడీపీ నేత అక్రమాలు: YCP

నగరి ఎమ్మెల్యే అండతో టీడీపీ నేత భారీగా రేషన్ అక్రమ రవాణా చేశారని వైసీపీ ఆరోపించింది. నిండ్రలోని నెట్టేరి వద్ద తనిఖీల్లో 4 టన్నుల రేషన్ బియ్యంతో టీడీపీ ఎస్సీ సెల్ నేత అల్లిముత్తు పట్టుబడినట్లు తెలిపింది. తర్జనభర్జనల తర్వాత అల్లిముత్తు , కార్తీక్ , విక్రమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, సీజ్ ద షిప్ అనే పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించింది.
News December 23, 2025
చిత్తూరు: మూడేళ్ల నుంచి 257 మంది మృతి

బైక్ ప్రమాదాలలో మృత్యువాతను తప్పించేలా చిత్తూరు జిల్లాలో పోలీసులు హెల్మెట్ వాడకంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకపోవడంతో 2023లో 84 మంది, 2024లో 90, ఈ సంవత్సరం ఇప్పటివరకు 83 మంది ప్రమాదాలలో మృతి చెందారు. వీటిని అరికట్టేందుకు అధికారులు గత కొద్ది రోజులుగా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారిలో మార్పుకు ప్రయత్నిస్తున్నారు.
News December 23, 2025
చిత్తూరు జిల్లాలో మందగిస్తున్న ఉపాధి పనులు.!

వేతనాలు సకాలంలో మంజూరు కాకపోవడంతో జిల్లాలో ఉపాధి పనులు మందగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి వేతనాలు మంజూరు కావడం లేదు. కూలీల వేతనాల మొత్తం రూ.67.88 లక్షలు, మెటీరియల్ కాంపోనెంట్ రూ.39.17 కోట్లు మొత్తం రూ.39.84 కోట్ల మేర బకాయిలు పేరకపోయాయి. కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నా.. కూలీలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.


