News May 24, 2024

కార్యాలయ వెబ్సైట్‌లో పది రీకౌంటింగ్ ఫలితాలు: ప్రేమ్‌కుమార్

image

పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2024కు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఆయా వెబ్‌సైట్‌లో డౌన్లోడ్ చేసి సంబంధిత కాపీలను విద్యార్థులకు అందజేయవలసిందిగా విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Similar News

News April 23, 2025

10th RESULTS: ఏడో స్థానంలో విజయనగరం జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 22,777 మంది పరీక్ష రాయగా 19,824 మంది పాసయ్యారు. 11,413 మంది బాలురులో 9.748(85.41%) మంది, 11,364 మంది బాలికలు పరీక్ష రాయగా 10,076(88.67%) మంది పాసయ్యారు. 87.04% పాస్ పర్సంటైల్‌తో రాష్ట్రంలో విజయనగరం జిల్లా ఏడో స్థానంలో నిలిచింది.

News April 23, 2025

VZM: ఆ పాఠశాల ఫలితాల కోసం ఎదురుచూపు

image

బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు బాగా చదవడం లేదని పరీక్షలకు నెల రోజుల ముందు హెచ్ఎం రమణ విద్యార్థుల ముందు గుంజీలు తీసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తామని, ట్రిపుల్ ఐటి సీట్లు సాధిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 85 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరి ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News April 23, 2025

VZM: భార్గవ్, భార్గవ ఇద్దరూ ఇద్దరే..!

image

యూపీఎస్సీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సివిల్స్‌కు విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఎంపికైన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన పొటుపురెడ్డి భార్గవ్(455వ ర్యాంక్) కాగా మరొకరు రాజాం మండలం సారధి గ్రామానికి చెందిన వావిలపల్లి భార్గవ్(830వ ర్యాంక్) ఉన్నారు. భార్గవ్ ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణలో ఉండగా, భార్గవ స్టేట్ టాక్స్ అధికారిగా ఉన్నారు.

error: Content is protected !!