News March 4, 2025
కార్వేటినగరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

కార్వేటినగరం మండలం పళ్లిపట్టు మూడు రోడ్ల కూడలి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళత్తూరుకు చెందిన శ్రావణ్ కుమార్, చెన్నకేశవ అనే ఇద్దరు బర్త్ డే పార్టీకి వెళ్లి తిరిగి కార్వేటినగరం నుంచి బైక్పై వస్తూ డివైడర్ను ఢీకొన్నారు. ఈ ఘటనలో శ్రావణ్ కుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. చెన్నకేశవ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 22, 2025
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ‘ముస్తాబు’

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమం పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. వసతి గృహాలు, ముస్తబు కార్యక్రమ అమలుపై సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ను మండల ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని ఆయన సూచించారు. డీఈఓ రాజేంద్రప్రసాద్, సర్వ శిక్ష అభియాన్ పీవో వెంకట రమణ పాల్గొన్నారు.
News December 22, 2025
చిత్తూరు పోలీసులకు 50 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 50 ఫిర్యాదుల అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 5, భూతగాదాలపై 18 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ
సిబ్బందిని ఆదేశించారు.
News December 22, 2025
చిత్తూరు జిల్లాలో 88.36% పల్స్ పోలియో

చిత్తూరు జిల్లాలో ఆదివారం 88.36% చిన్నారులకు పల్స్ పోలియో వేసినట్లు DIO హనుమంతురావు తెలిపారు. జిల్లాలో ఐదేళ్ల లోపు 2,21,502 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించి 142 రూట్లలో 212 వాహనాల ద్వారా పోలియో చుక్కలను పంపిణీ చేశారు. 1415 బూత్ల పరిధిలో 5,800 మంది సిబ్బందితో ఆదివారం 2,94,600 వ్యాక్సిన్ కిట్లు వినియోగించారు. జిల్లాలో ఆదివారం 1,84,648 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.


