News March 30, 2024
కార్వేటినగరం: 9 మంది జూదరుల అరెస్టు

కార్వేటినగరం మండలంలోని భట్టువారిపల్లిలో జూదం ఆడుతున్న 9మంది నిందితులను అరెస్ట్ చేశామని, వీరిలో తిరుపతి నగరంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఉన్నాడని సీఐ సత్యబాబు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి పుత్తూరు కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో శిక్షణ డీఎస్పీ పావన్ కుమార్, ఎస్సై వెంకటకృష్ణ, ఏఎస్సై మునికృష్ణ పాల్గొన్నారు.
Similar News
News January 10, 2026
బంగారుపాళ్యం: కంటైనర్ ఢీకొని ఒకరి స్పాట్ డెడ్

బంగారుపాళ్యం మండలం బలిజపల్లి సమీపంలో కంటైనర్ వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలు మేరకు.. శుక్రవారం రాత్రి బలిజపల్లి సమీపంలో గల ఫ్లైఓవర్ వద్ద బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని బెంగళూరు వైపు నుంచి చిత్తూరు వైపు వస్తున్న కంటైనర్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని హాస్పిటల్‌కి తరలించారు.
News January 10, 2026
చిత్తూరు జిల్లాలో 638 విద్యుత్ సమస్యలు

చిత్తూరు జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 251 సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్లవి 26, LT లైన్ 339, సర్వీసు లైన్ 22 కలిపి మొత్తం 638 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్‌స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 63 సమస్యలను పరిష్కారించినట్లు చెప్పారు.
News January 9, 2026
చిత్తూరు: ‘అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు’

ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలను వసూలు చేస్తే చర్యలు తప్పవని రవాణా ఉప కమిషనర్ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఆయన కార్యాలయంలో బస్సుల యాజమాన్యంతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ను వాయిదా, రద్దు చేయడం తగదన్నారు. ప్రతి బస్సులో సేఫ్టీ పరికరాలు ఉండాలన్నారు.


