News January 13, 2025

కాలినడకన తిరుమలకు చేరుకున్న ఇండియా క్రికెటర్ 

image

భారత క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. నితీశ్ రాత్రికి తిరుమలలో బస చేసి మంగళవారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.

Similar News

News November 26, 2025

భూపతి మృతిపట్ల CM చంద్రబాబు విచారం

image

రామకుప్పం(M) వీర్నమలకు చెందిన వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ భూపతి మృతి పట్ల CM చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. భూపతి విద్యుత్ షాక్‌తో మృతి చెందడం బాధాకరమని, వార్డు మెంబర్, గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కోసం ఎంతగానో కష్టపడి పని చేశారని గుర్తు చేసుకున్నారు. అలాంటి యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందడం బాధాకరమన్నారు. భూపతి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని CM అన్నారు.

News November 26, 2025

చిత్తూరు: టెన్త్ హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్

image

టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్‌పై పరీక్షా కేంద్రాన్ని తెలిపే క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు కేంద్రాలను గుర్తించడం సులభతరం కానుంది. చిత్తూరు జిల్లాలోని 535 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 22 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు 122 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.

News November 26, 2025

3 ముక్కలుగా పుంగనూరు..!

image

మదనపల్లె జిల్లాలోకి పుంగనూరును మార్చనున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని 6మండలాలను 3రెవెన్యూ డివిజన్ల పరిధిలోకి చేర్చనున్నారు. పుంగనూరు, చౌడేపల్లె మండలాలు మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేయనున్నారు. సోమల, సదుం కొత్త డివిజన్ పీలేరులో కలుస్తాయి. పులిచెర్ల, రొంపిచర్ల మండలాలను చిత్తూరు డివిజన్‌లోనే కొనసాగించనున్నారు. ఎల్లుండి జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకుంటారు.