News February 24, 2025
కాలినడకన తిరుమలకు చేరుకున్న సినీనటి నిహారిక

ప్రముఖ సినీ నిర్మాత, నటి నిహారిక కొణిదెల సోమవారం సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ముందుగా అలిపిరి వద్ద పాదాల మండపంలో పూజ చేసి అనంతరం కాలినడకన సన్నిహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్లారు. ఆమె రాత్రి తిరుమలలో బస చేసి మంగళవారం వేకువజామున తోమాల సేవలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు.
Similar News
News February 25, 2025
టెన్త్ విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్

AP: ప్రభుత్వ బడుల్లో చదివే టెన్త్ విద్యార్థులకు మార్చి 3 నుంచి 13 వరకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించనున్నారు. పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగానే ఈ పరీక్షలు జరగనున్నాయి. గ్రాండ్ టెస్ట్ ముగిసిన 3 రోజులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తొలిసారి ఇంగ్లిష్ మీడియంలో NCERT సిలబస్ పరీక్షలు రాస్తున్నందున ఈ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు.
News February 25, 2025
మిర్చి రైతులకు మద్దతు ధర: మంత్రి లోకేశ్

రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం CBN చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి లోకేశ్ తెలిపారు. సోమవారం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేలా మిర్చి రైతులకు క్వింటా కనీస మద్దతు ధర రూ.11,781లు చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిందని మంత్రి అన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు.
News February 25, 2025
పెదకాకాని మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: నాదెండ్ల

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో జరిగిన విద్యుదాఘాతం ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై సోమవారం ఓ ప్రకటనలో మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.