News February 13, 2025

కాలువలో మృతదేహం.. నంద్యాల వాసిగా గుర్తింపు!

image

బనగానపల్లె మండలం ఐ.కొత్తపేట గ్రామ సమీపంలోని ఎస్ఆర్బీసీ కాలువలో మృతదేహం లభ్యమైంది. మృతుడు నంద్యాల పట్టణ వాసిగా గుర్తించినట్లు బనగానపల్లె పోలీసులు వెల్లడించారు. ఆధారాలను బట్టి నంద్యాలలో ఫ్రూట్ జ్యూస్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగించే షేక్ జాకీర్ బాషా(43)గా గుర్తించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News October 14, 2025

ఏలూరు: కవల పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

image

HYD బాలానగర్ PS పరిధిలో దారుణ ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో తల్లి తన ఇద్దరు కవల పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. పద్మారావు నగర్ ఫేజ్‌-1లో ఉంటున్న సాయిలక్ష్మి(27) తన రెండేళ్ల వయసు ఉన్న కవల పిల్లలు చేతన్‌ కార్తికేయ, లాస్యత వల్లి‌ని గొంతు నులిమి చంపి, అనంతరం భవనం పైనుంచి దూకి చనిపోయింది. సాయిలక్ష్మి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు.

News October 14, 2025

BREAKING: నూజివీడు: కవల పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

image

HYD బాలానగర్ PS పరిధిలో దారుణ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో నూజివీడుకు చెందిన సాయిలక్ష్మి (27) ఇద్దరు కవల పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. పద్మారావు నగర్ ఫేజ్‌-1లో నివసిస్తున్న ఆమె చేతన్‌ కార్తికేయ, లాస్యత వల్లి‌ని గొంతు నులిమి చంపి, అనంతరం భవనం పైనుంచి దూకి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 14, 2025

మదనపల్లె యువకుడికి 20ఏళ్ల జైలుశిక్ష

image

అత్యాచారం కేసులో ఓ యువకుడికి కఠిన శిక్ష పడింది. మదనపల్లెలోని బసినికొండకు చెందిన బాలికకు ప్రసాద్(23) 2021లో మాయ మాటలు చెప్పి నమ్మించాడు. ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో తాలూకా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో అతనికి చిత్తూరు పోక్సో కోర్టు జడ్జి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు.