News August 11, 2024
కాలువల్లో నీళ్లు వదలండి: హరీశ్‌రావు

రంగనాయక సాగర్‌కు మిడ్ మానేరు ద్వారా నీటి పంపింగ్ జరిగిందని, కాలువల్లో నీటి విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని MLA హరీశ్‌రావు ఇరిగేషన్ అధికారులను కోరారు. సిద్దిపేట ఇరిగేషన్ SE బస్వరాజ్, EE గోపాల కృష్ణతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం రంగనాయక సాగర్‌లో 2.3 TMCల నీరు ఉందని, 3TMCల పూర్తి సామర్థ్యం నీటిని నింపాలన్నారు.
Similar News
News February 26, 2026
మెదక్: అభివృద్ధికి కలెక్టర్ రాహుల్ రాజ్ కృషి

గత రెండేళ్లలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన హయాంలో పదవ తరగతి ఉత్తీర్ణత 93 నుంచి 97 శాతానికి పెరిగింది. 300 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, ఆరోగ్య కేంద్రాల్లో CCTVలు ఏర్పాటు చేసి వైద్య సేవలను మెరుగుపరిచారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంతో పాటు, వేలాది భూ సమస్యలను పరిష్కరించి పాలనలో వేగం పెంచారు.
News February 26, 2026
మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్

మెదక్ జిల్లాకు నూతన కలెక్టర్‌గా ప్రతిమ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న రాహుల్ రాజ్‌ను సహకార శాఖకు బదిలీ చేశారు. ప్రతిమా సింగ్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కలెక్టర్‌గా పదోన్నతితో మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు. ప్రతిమా సింగ్ గతంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
News February 26, 2026
BREAKING: మెదక్ కలెక్టర్ బదిలీ

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ బదిలీ అయ్యారు. సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ రాజ్ 2024 మార్చి 6న ఆదిలాబాద్ నుంచి మెదక్ కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. మెదక్ కలెక్టర్‌గా రంగారెడ్డి (లోకల్ బాడీస్) అదనపు కలెక్టర్ 2019 బ్యాచ్‌కు చెందిన ప్రతీమ సింగ్ IAS నియమితులయ్యారు.


