News February 6, 2025
కాలేజీ బస్సు ఢీకొని చిన్నారి మృతి

కాలేజీ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందిన ఘటన తొండంగి మండలం సీతారాంపురంలో బుధవారం జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె సుకన్య(3) మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి చనిపోయిందని గ్రామస్థులు, బంధువులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. పోలీసులు వారితో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News November 1, 2025
హోంమంత్రి పనితీరును ప్రశంసించిన సీఎం

హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరును సీఎం చంద్రబాబు ప్రశంసించారు. మొంథా తుఫాన్‌లో మంత్రి ప్రజలకు రక్షణ సహాయక చర్యల్లో పాల్గొని సేవలందించారన్నారు. ఈ మేరకు శనివారం ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రికి ప్రశంసాపత్రం, ఉత్తమ సేవా అవార్డును సీఎం అందజేశారు. ప్రజాసేవలో సీఎం చంద్రబాబు చూపిన మార్గం తమకు ఆదర్శం అని హోంమంత్రి అన్నారు.
News November 1, 2025
బంగారం డీల్.. రూ.25 లక్షలతో పరార్..!

తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి రూ.25 లక్షలు కాజేసిన ఘటన నరసరావుపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. నరసరావుపేటకు చెందిన గణేష్‌కు శుక్రవారం కేటుగాళ్లు తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మబలికారు. బంగారం డీల్ గురించి మాట్లాడుదామని కోటప్పకొండ వద్దకు రావాలని కోరారు.రూ.25 లక్షల నగదు తీసుకుని పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 1, 2025
RKP: ఈ నెల 3 నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల మరమ్మత్తు పనులు: మంత్రి

రామకృష్ణాపూర్ ప్రాంతంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల మరమ్మతులు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నాయని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. మరమ్మతుల్లో భాగంగా కొత్త వాటర్ ట్యాంక్ ఫిక్సేషన్, ప్లంబింగ్ కనెక్షన్లతో పాటు అవసరమైన ఇతర సామగ్రి అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో ప్రజలకు అన్ని సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.


