News February 6, 2025
కాలేజీ బస్సు ఢీకొని చిన్నారి మృతి

కాలేజీ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందిన ఘటన తొండంగి మండలం సీతారాంపురంలో బుధవారం జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె సుకన్య(3) మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి చనిపోయిందని గ్రామస్థులు, బంధువులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. పోలీసులు వారితో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News February 9, 2026
ASF జిల్లాలో రేపు, ఎళ్లుండి సెలవు

ఈ నెల 11న జరగనున్న ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10, 11న సెలవు ప్రకటించినట్లు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. పోలింగ్ నిర్వహణ కోసం ఉపయోగించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాలకు రేపు, ఎళ్లుండి స్థానిక సెలవు దినంగా ప్రకటించారు. ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
News February 9, 2026
చిత్తూరు: ‘డ్రోన్ కెమెరా నుంచి తప్పించుకోలేరు’

కార్వేటినగరం పోలీసులు డ్రోన్ కెమెరా నిఘాతో మండలంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సెకండ్ల వ్యవధిలో పట్టేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం సీఐ హనుమంతప్ప ఎస్ఐ తేజశ్వినితో కలిసి ధైర్యస్పర్శ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రోన్ కెమెరా నిఘా పర్యవేక్షణలో మందుబాబులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి పట్టుబడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 9, 2026
NZB: మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి హాజరైన సెక్యూర్ సెల్ ఆఫీసర్ మంద మకరంద్‌తో కలిసి కలెక్టర్ సోమవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.


