News February 9, 2025
కాలేశ్వరంలో నేటి కార్యక్రమాల వివరాలు

కాలేశ్వరంలో మహా కుంభాభిషేకం వైభవంగా సాగుతోంది. చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఇప్పటికే తుని తపోవన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు కాలేశ్వరానికి చేరుకున్నారు. ప్రాత: సూక్త మంత్ర పఠనం, ప్రాత:కాల పూజలు, రుద్రహవనం, జయాదులు, బలిప్రధానము, మహా పూర్ణాహుతి, ఉం.10:42 నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి, మంత్ర పుష్పం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగములు అనంతరం మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది.
Similar News
News November 27, 2025
సీఎం Vs డిప్యూటీ సీఎం.. SMలో మాటల యుద్ధం

కర్ణాటక CM సిద్దరామయ్య, Dy.CM డీకే శివకుమార్ మధ్య SMలో మాటల యుద్ధం సాగుతోంది. ‘మాట నిలబెట్టుకోవడం ప్రపంచంలోనే గొప్ప బలం’ అని శివకుమార్ తొలుత ట్వీట్ చేశారు. దీనికి ‘ఒక మాట ప్రజల కోసం ప్రపంచాన్ని మార్చలేకపోతే అది బలం కాదు’ అని సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. ‘కర్ణాటకకు మా మాట కేవలం నినాదం కాదు.. అదే మాకు ప్రపంచం’ అనే పోస్టర్ షేర్ చేశారు. ‘నా నాయకత్వంలో పలు నిర్ణయాలు తీసుకున్నా’ అని CM ట్వీట్లు చేశారు.
News November 27, 2025
ఇకనుంచి జలమండలిలో వాటర్ ఆడిట్: ఎండీ

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ అశోక్ రెడ్డి వాటర్ ఆడిట్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జలమండలిలో వాటర్ ఆడిట్‌ను ప్రారంభించామన్నారు. నీటి శుద్ధి కేంద్రాలు, ట్రాన్స్మిషన్లైన్లు, రిజర్వాయర్ల పర్యవేక్షించడానికి రూపొందించిన ఈ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న స్కాడా ఇంటిగ్రేషన్ చేయడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.
News November 27, 2025
WGL: తొలి రోజు 705 నామినేషన్లు

ఉమ్మడి WGLలో తొలి రోజు సర్పంచ్ స్థానాలకు 467, వార్డు స్థానాలకు 238 నామినేషన్లు దాఖలయ్యాయి.
> వరంగల్- 91 సర్పంచ్‌లకు 101.. 800 వార్డులకు 37
> హనుమకొండలో 69 సర్పంచ్‌లకు 86.. 658 వార్డులకు 61
> జనగామలో 110 సర్పంచ్‌లకు 108.. 1,024 వార్డులకు 44
> మహబూబాబాద్‌లో సర్పంచ్‌లకు 105, వార్డులకు 41
> ములుగులో 48 సర్పంచ్‌లకు 22.. 420 వార్డులకు 20
> భూపాలపల్లిలో 82 సర్పంచ్‌లకు 45.. 712 వార్డులకు 35


