News July 11, 2024
కాలేశ్వరం మేడిగడ్డ బ్యారేజీకి పెరిగిన వరద ప్రవాహం

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన అంబట్పల్లి గ్రామంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. 16.17 టీఎంసీ నిల్వ సామర్థ్యం కలిగిన బ్యారేజీకి మంగళవారం ఇన్ఫో 35,200 క్యూసెక్కులు రాగా.. బుధవారం 41,500 క్యూసెక్కులకు పెరిగింది. బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రవాహం 89.90 మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.
Similar News
News December 15, 2025
వరంగల్: ఇక ప్రాదేశిక స్థానాలపై కన్ను..!

జిల్లాలో రెండు విడుతల గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో చివరి విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లను చేపట్టారు. కాగా, నాయకులు ప్రాదేశిక స్థానాలపై దృష్టి సారించారు. రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన వారు, రిజర్వేషన్ అనుకూలించని వారు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలను చేపట్టారు. ప్రాదేశిక స్థానాలకు ఈ నెలాఖరున నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
News December 15, 2025
గీసుగొండలో కొండా వర్గం పాగా!

పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా వీడిపోయిన విషయం తెలిసిందే. గీసుగొండ మండలంలో 21 పంచాయతీల్లో రెండు ఏకగ్రీవం కాగా, మిగిలిన 19 పంచాయతీల్లో 7 పంచాయతీలకు కొండా వర్గం గెలిచింది. 3 బీఆర్ఎస్, 1 స్వతంత్ర, 8 రేవూరి కాంగ్రెస్ పార్టీలు గెలిచాయి. వాస్తవానికి కాంగ్రెస్ 15 పంచాయతీలు గెలిచినట్టు. రెండు వర్గాల ఆధిపత్య పోరుతో బీఆర్ఎస్కు డ్యామేజీ అయ్యింది.
News December 15, 2025
వంజరపల్లిలో ఉపసర్పంచ్ ఎన్నిక.. ఇతనే సర్పంచ్ నా ఇక..?

వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లిలో మోర్తల చందర్ రావు ఆరో వార్డు నుంచి గెలిచి ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వ్ కావడంతో గిరిజనులు లేకపోవడం కారణంగా సర్పంచ్ పదవికి ఎవరూ నామినేషన్ వేయలేదు. ఇదే పరిస్థితితో 1, 4, 5 వార్డుల్లోనూ ఎస్టీకి రిజర్వు కాగా నామినేషన్లు నమోదు కాలేదు. గ్రామంలో 2, 3, 6, 7, 8 వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. దీంతో సర్పంచ్ ఇతనేనా..?


