News July 11, 2024
కాలేశ్వరం మేడిగడ్డ బ్యారేజీకి పెరిగిన వరద ప్రవాహం

భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన అంబట్పల్లి గ్రామంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. 16.17 టీఎంసీ నిల్వ సామర్థ్యం కలిగిన బ్యారేజీకి మంగళవారం ఇన్ఫో 35,200 క్యూసెక్కులు రాగా.. బుధవారం 41,500 క్యూసెక్కులకు పెరిగింది. బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రవాహం 89.90 మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.
Similar News
News February 17, 2025
వరంగల్: మక్కలు క్వింటా రూ.2,355

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మొక్కజొన్న తరలివచ్చింది. అయితే గత శుక్రవారం లాగే ఈరోజు కూడా మక్కలు (బిల్టీ) ధర రూ.2,355 ధర పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.7200, పచ్చి పల్లికాయకి రూ.4,100 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
News February 17, 2025
వరంగల్‌లో “ది స్వయంవర్”

తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ది స్వయంవర్ స్టోర్‌ను వరంగల్‌లో ప్రారంభించారు. దేశంలోని 12 రాష్ట్రాల్లోని 42 నగరాల్లో 85 బ్రాంచీలతో ప్రజలకు అందుబాటులో స్పెషల్ కలెక్షన్ అందిస్తోంది ది స్వయంవర్.వివాహాది శుభకార్యాలకు అద్భుతమైన కలెక్షన్ అందించడం స్టోర్ ప్రత్యేకత. పిల్లలు, పెద్దల కోసం పట్టు పంచెలు, దుపట్టా, పైజామా, కుర్తా మొదలైన వస్త్రాలు అందుబాటు ధరల్లో అందిస్తున్నట్టు ది స్వయంవర్ యాజమాన్యం తెలిపింది.
News February 17, 2025
వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత శుక్రవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర గత శుక్రవారం రూ.13,600 పలకగా.. నేడు రూ.13,800కి చేరింది. అలాగే వండర్ హాట్(WH) మిర్చికి శుక్రవారం రూ.15,500 ధర రాగా.. ఈరోజు రూ. 16వేలు పలికింది. మరోవైపు 341 మిర్చికి మొన్న రూ.13,600 ధర రాగా.. ఈరోజు రూ.13,500 అయింది.