News January 10, 2025
కాల్వ శ్రీరాంపూర్: ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన సింధుజ

తెలంగాణ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీల్ ఫలితాలలో కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన బంగారి సింధుజ సత్తా చాటింది. గతేడాది జులైలో రాత పరీక్ష జరగగా, అక్టోబర్ నుంచి డిసెంబర్ 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. ఇందులో భాగంగా బంగారి సింధుజ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 12, 2026
కౌంటింగ్ వేళ అప్రమత్తంగా ఉండాలి: సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. నగరంలోని అస్త్ర కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్‌లో పోలీసు అధికారులకు, సిబ్బందికి సీపీ గౌష్ ఆలం దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకుండా నిఘా ఉంచాలన్నారు.
News February 12, 2026
కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ టాప్

కరీంనగర్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపాలిటీ 81.47 శాతం పోలింగ్ నమోదు చేసి జిల్లాలో టాప్‌గా నిలిచింది. జమ్మికుంటలో 79.81%, చొప్పదండిలో 78.76%, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 62.98% పోలింగ్ నమోదైంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్‌లో 77.8% పోలింగ్ నమోదు కాగా, ఈసారి ఏకంగా 3.67 శాతం పెరిగింది. అధిక ఓటింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.