News January 30, 2025

కాల్వ శ్రీరాంపూర్: విషపురుగు కుట్టి వ్యక్తి మృతి

image

కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బండి మధునయ్య విషపురుగు కుట్టి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామంలోని పాఠశాలలో పార్ట్ టైం స్వీపర్ గా పనిచేస్తున్న మధునయ్యను జనవరి 26న ఏదో విషపురుగు కుట్టింది. వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం చనిపోయాడు. మృతుడి కొడుకు బండి సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.

Similar News

News November 22, 2025

వనజీవి జీవితంపై సినిమా మొదలు!

image

తెలంగాణ ‘వనజీవి’గా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఖమ్మంలో ఈ బయోపిక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని లక్షలాది మొక్కలను నాటడానికి, రక్షించడానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదర్శవంతమైన, నిరాడంబర జీవన విధానం, పర్యావరణ భక్తిని ఈ సినిమా వెండితెరపైకి తీసుకురానుంది. ఆయన పాత్రలో నటుడు బ్రహ్మాజీ కనిపించనున్నారు.

News November 22, 2025

HYD: స్టేట్ క్యాడర్‌ మావోయిస్టులు లొంగుబాటు.!

image

రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) బి.శివధర్ రెడ్డి ముందు నేడు భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. స్టేట్ క్యాడర్‌కు చెందిన అజాద్, అప్పా నారాయణ, ఎర్రాలు సహా పలువురు మావోయిస్టులు లొంగుబాటు కార్యక్రమానికి హాజరు కానున్నారు. లొంగుబాటుకు సంబంధించిన మరిన్ని వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.

News November 22, 2025

HYD: పంచాయతీ ఎన్నికలు.. అబ్జర్వర్లతో ఎస్‌ఈసీ కీలక సమావేశం

image

తెలంగాణలో పంచాయితీ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల సిద్ధతల్లో భాగంగా ఈరోజు జిల్లాలవారీగా అబ్జర్వర్లతో ఎస్‌ఈసీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. వచ్చే వారంలోనే పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి దశలో ఉన్నాయి. అబ్జర్వర్లతో కీలక సమావేశం పూర్తయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకొని షెడ్యూల్ విడుదల చెయ్యనుంది.