News January 30, 2025
కాల్వ శ్రీరాంపూర్: విషపురుగు కుట్టి వ్యక్తి మృతి

కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బండి మధునయ్య విషపురుగు కుట్టి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామంలోని పాఠశాలలో పార్ట్ టైం స్వీపర్ గా పనిచేస్తున్న మధునయ్యను జనవరి 26న ఏదో విషపురుగు కుట్టింది. వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం చనిపోయాడు. మృతుడి కొడుకు బండి సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
Similar News
News February 15, 2025
బర్డ్ ఫ్లూ.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి!

AP: బర్డ్ ఫ్లూతో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌కు సంబంధించి ప్రజలు, కోళ్ల పెంపకందారుల సందేహాలు తీర్చేందుకు పశుసంవర్ధక శాఖ టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. ఎవరికైనా సందేహాలుంటే ఉ.6 నుంచి రా.9 గంటల మధ్య 0866 2472543, 9491168699 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
News February 15, 2025
కొండ్రావుపల్లి: భార్యాభర్తలపై దాడి

కొండ్రావుపల్లిలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. అందులో భార్యభర్తలకు గాయాలయ్యాయి. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు పొలంలో అదే గ్రామానికి చెందిన అర్జున్‌రావు గేదె వచ్చి మేస్తోంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్జున్‌రావు, అతడి కుమారుడు బాబురావు వచ్చి శ్రీనివాసరావు దంపతులపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరి తలలకు తీవ్రగాయాలు కాగా.. వారిని హైదరాబాద్ తరలించారు.
News February 15, 2025
కంచిలి: గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

కంచిలి మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను శుక్రవారం సాయంత్రం కంచిలి ఎస్సై పారినాయుడు పట్టుకున్నారు. వీరి నుంచి 2 కేజీల గంజాయి, 2 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీల్లో భాగంగా ఒడిశా రాష్ట్రం సుర్లా నుంచి తరలిస్తుండగా ముగ్గురిని పట్టుకున్నామని తెలిపారు. వీరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.