News September 5, 2024

కాల్ డేటా అధారంగానే పట్టుకున్నారు

image

విశాఖలో యువకుడికి పోక్సో కేసులో 20 ఏళ్ల శిక్షను న్యాయస్థానం విధించిన విషయం <<14024641>>తెలిసిందే<<>>. బాలిక కాల్ డేటా ఆధారంగా నరేశ్‌ను పోలీసులు విచారించారు. 2021 అక్టోబర్ 5 అర్ధరాత్రి బాలిక తండ్రికి మెలుకువ రాగా కుమార్తె లేదు. దీంతో చుట్టుపక్కల వెతుకుతుండగా నరేశ్ అపార్టమెంట్‌లో ఉన్న బాలిక తండ్రికి భయపడి అపార్ట్‌మెంట్‌ పైకి ఎక్కింది. అక్కడి నుంచి ప్రమాదవశాత్తు పడి మృతిచెందినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు.

Similar News

News September 9, 2025

VZM: ‘ఎరువులు అక్రమ నిల్వలు చేస్తే చర్యలు తప్పవు’

image

ఎరువులు అక్రమ నిల్వలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంబేడ్కర్ హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 11 మంది రైతులు కలెక్టర్‌తో మాట్లాడారు. జిల్లాలో 400 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రానున్న 3 రోజుల్లో ఓ కంపెనీ ద్వారా 1,000 మెట్రిక్ టన్నులు, కోరమాండల్ కంపెనీ ద్వారా 1000 మెట్రిక్ టన్నులు వస్తాయన్నారు. వీటిని 25వ తేదీ లోపు అందజేస్తామన్నారు.

News September 9, 2025

మాదకద్రవ్యాల నియంత్రణకు విస్తృత ప్రచారం: VZM ఎస్పీ

image

మాదక ద్రవ్యాల నియంత్రణకు సంకల్పం ప్రచార రథం ద్వారా విజయనగరం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు. క్షేత్ర స్ధాయిలో ‘సంకల్ప రథం’తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువతతో పాటు డ్రగ్స్‌ అలవాటు ఉన్న వ్యక్తులు, ప్రజలకు ‘సంకల్పం’ కార్యక్రమాన్ని మరింత చేరువ చేసి, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.

News September 9, 2025

ఎస్.కోట: ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

image

ఎస్.కోటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం ఇసుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ స్థానిక వన్ వే రోడ్డుపై నడిచి వెళుతున్న వల్లయ్యను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ నారాయణమూర్తి ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.