News August 21, 2024
కాళంగి నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

సూళ్లూరుపేటలోని మహాదేవయ్య నగర్ వెనకవైపు ఉన్న కాళంగి నదిలో బుధవారం ఓ గుర్తుతెలియని మృతదేహం తేలియాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే చీకటి పడడంతో గురవారం మృతదేహాన్ని వెలికితీస్తామని పోలీసులు చెప్పారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
Similar News
News October 29, 2025
మన నెల్లూరు కలెక్టర్ ప్రేమకు ఫిదా

కలెక్టర్ హిమాన్షు శుక్ల సాధారణ వ్యక్తిలా మారి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలిచిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నెల్లూరు రూరల్ మండలం కొండ్లపూడి పునరావాస కేంద్రంలో చిన్నారులకు పాఠాలు చెప్పి వారిని నవ్వించారు. అలాగే వారితో గడిపిన క్షణాలను గుర్తు పెట్టుకొనేందుకు సెల్ఫీ తీసుకున్నారు. కలెక్టర్ స్థాయిలో బాధితులపై ఆయన చూపిన ప్రేమకు అక్కడివారు ముగ్దులయ్యారు.
News October 29, 2025
కావలిలో భారీ వర్షపాతం నమోదు

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తెలియజేశారు. కావలి 21.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దగదర్తిలో 17.7, ఉలవపాడులో 16.2, జలదంకిలో 16.1, కందుకూరులో 15.3, కొడవలూరులో 14.6, కలిగిరిలో 13.8, లింగసముద్రంలో 13.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది.
News October 29, 2025
నెల్లూరులో Photo Of The Day

నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రాత్రి, పగలు, వర్షం అనే తేడా లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. నెల్లూరు రూరల్ కొండ్లపూడిలోని పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆ ఇద్దరూ అక్కడే భోజనం చేసి వారికి భరోసా కల్పించారు.


