News February 5, 2025
కాళేశ్వరంలో కుంభాభిషేకం, మహాశివరాత్రి, సరస్వతీ పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన

కాళేశ్వరం గ్రామంలో గోదావరి తీరాన్ని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే బుధవారం పరిశీలించారు. కుంభాభిషేకం, మహాశివరాత్రి, సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. వాహనాలకు సరైన పార్కింగ్ ఉండే విధంగా, ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. పలువురు ఎస్సైలు, సీఐలు పాల్గొన్నారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్ రిజల్ట్స్.. ఆదిలాబాద్ వాసుల ఫోకస్

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని ఆదిలాబాద్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుస్తుందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రజలలో ఉత్కంఠ రేపుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. గ్రామాల్లో నలుగురు కలిస్తే జూబ్లీ ఫలితంపైనే చర్చిస్తున్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని టాక్.
News November 14, 2025
వరంగల్: తటస్థంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిన్నటి లాగే స్థిరంగా ఉంది. మంగళవారం, బుధవారం రూ.6,830 పలికిన క్వింటా పత్తి ధర గురువారం రూ.6,870 అయింది. శుక్రవారం కూడా అదే ధర పలికిందని వ్యాపారులు తెలిపారు. అయితే గతవారం రూ.7 వేలకు పైగా పలికిన ధర ఈ వారం భారీగా తగ్గడంతో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు.
News November 14, 2025
Round 1 Official: నవీన్ యాదవ్ 47 ఓట్ల లీడ్

జూబ్లీహిల్స్ బైపోల్ రౌండ్ 1 ఫలితాలను ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. షేక్పేట డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని స్పష్టం చేశారు. తొలి రౌండ్లో నవీన్ యాదవ్కు 8911 (+ 47) ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8864 (-47) ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2167 (-6744) ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్లో 42 బూత్లలో పోలైన ఓట్లను లెక్కించారు.


