News February 5, 2025
కాళేశ్వరంలో కుంభాభిషేకం, మహాశివరాత్రి, సరస్వతీ పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన

కాళేశ్వరం గ్రామంలో గోదావరి తీరాన్ని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే బుధవారం పరిశీలించారు. కుంభాభిషేకం, మహాశివరాత్రి, సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. వాహనాలకు సరైన పార్కింగ్ ఉండే విధంగా, ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. పలువురు ఎస్సైలు, సీఐలు పాల్గొన్నారు.
Similar News
News March 25, 2025
NZB: కాంగ్రెస్ రెండు గ్రూపుల వర్గపోరుపై అధిష్టానం నజర్

బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్లో రెండు గ్రూపుల వర్గపోరుపై రాష్ట్ర అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ ప్రతినిధికి, ఇటీవల పార్టీలో చేరిన ప్రతినిధికి మధ్య జరుగుతున్న వర్గ పోరు తారాస్థాయికి చేరడంతో పలువురు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. BRS హయాంలో కష్ట కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పని చేసిన తమను ఇబ్బందులు పెట్టడం ఏమిటని వాపోతున్నారు.
News March 25, 2025
క్షయ వ్యాధి నియంత్రణలో జిల్లాకు మొదటి స్థానం జిల్లా కలెక్టర్

MBNR జిల్లావ్యాప్తంగా 2,087 మందికి టీబీ లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి చికిత్స అందించడంతో 1,218 మంది బాగుపడ్డారని ఇందుకుగాను రాష్ట్ర టీబీ నియంత్రణ విభాగం జిల్లాకు మొదటి స్థానం ఇచ్చిందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా వివరించారు. మిగిలిన 1,767 మంది రోగులకు నెలకు రూ.వేయి చొప్పున వారికి చెల్లిస్తున్నామన్నారు.
News March 25, 2025
పిల్లల్లో కంటి చూపు సమస్యలు.. నివారణ ఇలా

చాలా మందికి చిన్నతనంలోనే కంటి చూపు సమస్యలొస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, లో లైట్లో చదవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. ఈ సమస్య పోయి కంటిచూపు మెరుగుపడాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడంతో పాటు సహజ కాంతి, పచ్చని వాతావరణంలో ఆడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం (క్యారెట్, పాలకూర, టమాట, బాదం, వాల్నట్స్), కంటి వ్యాయామాలు, రోజూ 8-10hrs నిద్రపోవడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.