News January 31, 2025
కాళేశ్వరంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలోని మంగళికుంట చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి చేరుకొని మృతి దేహాన్ని పరిశీలించారు. కాళేశ్వరానికి చెందిన వ్యక్తినా? లేక వేరే వ్యక్తినా? అని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 24, 2025
NLG: ‘TCC పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి’

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఎగ్జామ్, లోయర్ అండ్ హయ్యర్ డ్రాయింగ్ అండ్ టైలరింగ్ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.bse.telangana.gov.in ను చూడాలన్నారు. .
News November 24, 2025
మంచిర్యాల: ఓటు వేయడానికి రెడీనా..!

మంచిర్యాల జిల్లాలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లను ఈ విధంగా కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 306 గ్రామపంచాయతీలు, 2,680 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు 65, ఎస్సీ 81, బీసీ 23, జనరల్ 137 స్థానాలు కేటాయించారు. డిసెంబర్ రెండో వారంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు.
News November 24, 2025
పాలమూరు: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

నారయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. దాదాపు 4గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యేపై అని మాగునూరు పోలీసులు ఆయనతోపాటు బీఆర్ఎస్ నేతలు పలువురిపై కేసు నమోదు చేశారు.


