News February 22, 2025

కాళేశ్వరంలో ఘనంగా సాగుతున్న పరిశుద్ధ్య పనులు

image

మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో మహాశివరాత్రికి ప్రత్యేక పరిశుద్ధ్య పనులు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. శనివారం పుష్కర ఘాట్ ఆవరణంలో అక్కడ ఉన్న చెత్త చదరంగం మొత్తం తీసి క్లీన్ చేసి దూరంగా పడేస్తున్నారు. దీంతో వీఐపీ ఘాట్ స్నానానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంది.

Similar News

News February 23, 2025

గింజేరు జంక్షన్‌లో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

గంట్యాడ మండలం గింజేరు జంక్షన్ వద్ద రెండు బైకులు ఢీకొట్టిన ఘటనలో ఆనంద్(55) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు విజయనగరం నుంచి ఎస్.కోట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆనంద్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్రాసుపత్రికి 108లో తరలించారు.

News February 23, 2025

ప్రజలంతా ఫిట్‌గా ఉండాలి: ప్రధాని మోదీ

image

దేశ ప్రజలంతా ఫిట్‌గా, ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మన్‌కీ బాత్‌లో ఒబేసిటీ సమస్యను ప్రధాని ప్రస్తావించారు. నగరాల్లో పిల్లలు, పెద్దల్లో ఒబేసిటీ సమస్య పెరుగుతోందని చెప్పారు. దీని వల్ల అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయని, పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా తల్లిదండ్రులు చూడాలని పిలుపునిచ్చారు.

News February 23, 2025

ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండండి: బెల్లంపల్లి ఎమ్మెల్యే

image

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టభద్రులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో దిశానిర్దేశం చేశారు. పట్టభద్రులంతా నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.

error: Content is protected !!