News February 7, 2025
కాళేశ్వరంలో తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు
కాళేశ్వరంలో ఈనెల 7 నుంచి 9 వరకు మహా కుంభాభిషేకం మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగు నీటి ఏర్పాటు, తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటుగా అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.
Similar News
News February 8, 2025
కార్తీ ఖైదీ-2లో కమల్ హాసన్?
లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కార్తీ హీరోగా ఖైదీ-2 మూవీ త్వరలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. లోకేశ్-కమల్ కాంబోలో 2022లో వచ్చిన విక్రమ్ సినిమా సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్(LCU)లో భాగంగానే ఖైదీ సీక్వెల్ కూడా ఉండనుంది.
News February 8, 2025
ఢిల్లీ దంగల్లో విజేత ఎవరు? నేడే కౌంటింగ్
దేశమంతా ఆసక్తి ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడికానున్నాయి. ఉ.7గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. AAP, BJP మధ్యే ప్రధాన పోటీ నెలకొనగా, ఏ పార్టీది గెలుపనేది మ.12కు క్లారిటీ రానుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద EC పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ప్రతి అప్డేట్ను WAY2NEWS మీకు ఎక్స్క్లూజివ్గా అందించనుంది. అన్ని వివరాలు అందరికంటే ముందే మన యాప్లో చూడవచ్చు.
News February 8, 2025
బుగ్గారం: ట్రాక్టర్ ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు
ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో దంపతులు తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో బుగ్గారం మండలం వెల్గొండ గ్రామానికి చెందిన అక్కల సునీత, శేఖర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.