News February 9, 2025
కాళేశ్వరంలో నేటి కార్యక్రమాల వివరాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739064683568_1259-normal-WIFI.webp)
కాళేశ్వరంలో మహా కుంభాభిషేకం వైభవంగా సాగుతోంది. చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఇప్పటికే తుని తపోవన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు కాళేశ్వరానికి చేరుకున్నారు. ప్రాత: సూక్త మంత్ర పఠనం, ప్రాత:కాల పూజలు, రుద్రహవనం, జయాదులు, బలిప్రధానము, మహా పూర్ణాహుతి, ఉం.10:42 నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి, మంత్ర పుష్పం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగములు అనంతరం మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది.
Similar News
News February 10, 2025
కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు.. అప్డేట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739191580109_51309702-normal-WIFI.webp)
కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు మొత్తం గ్రాడ్యుయేట్ నామినేషన్లు- 100, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లు- 17 దాఖలయ్యాయని ఎన్నికల అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి వెల్లడించారు. ఇందులో నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి దాఖలైన నామినేషన్లు- 51, టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్లు- 8 వచ్చాయని తెలిపారు. కాగా.. నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది.
News February 10, 2025
చిగురుమామిడి: బైక్కు అడ్డొచిన కోతి.. ఇద్దరికి గాయాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739184827715_51339181-normal-WIFI.webp)
కోతి అడ్డు రావడంతో ద్విచక్రవాహనంపై నుంచి కింద పడిన ఓ మహిళ కాలు విరిగింది. చిగురుమామిడి గ్రామంలోని పెద్దమ్మతల్లి ఆలయ సమీపంలో, కేశవపూర్కు చెందిన పద్మ, భర్తతో కలిసి సోమవారం బైక్పై వెళ్తున్నారు. వాహనానికి వానరం అడ్డురావడంతో బ్రేక్ వేయగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో పద్మ కాలు విరిగి తీవ్రంగా గాయపడగా.. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, క్షతగాత్రులను 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News February 10, 2025
KNR: రేపు ముసాయిదా జాబితా విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739163227433_50202864-normal-WIFI.webp)
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. KNR జిల్లాలో 15 ZPTCలు, 170 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.