News February 9, 2025
కాళేశ్వరంలో నేటి కార్యక్రమాల వివరాలు

కాళేశ్వరంలో మహా కుంభాభిషేకం వైభవంగా సాగుతోంది. చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఇప్పటికే తుని తపోవన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు కాళేశ్వరానికి చేరుకున్నారు. ప్రాత: సూక్త మంత్ర పఠనం, ప్రాత:కాల పూజలు, రుద్రహవనం, జయాదులు, బలిప్రధానము, మహా పూర్ణాహుతి, ఉం.10:42 నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి, మంత్ర పుష్పం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగములు అనంతరం మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది.
Similar News
News March 28, 2025
KNR: రేషన్‌షాపుల్లో సన్నబియ్యం.. అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది. దీంతో కరీంనగర్ జిల్లా 2,77,323 మంది లబ్ధిదారులకు లబ్ధి జరగనుంది. ఇది వరకు రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో చాలామంది లబ్ధిదారులు వాటిని అమ్ముకునేందుకు మొగ్గుచూపే వారు. ఇక నుంచి సన్నబియ్యం రేషన్ షాపుల్లో పంపిణీ చేయనుండటంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్ పడినట్టయ్యింది.
News March 28, 2025
ఎలిగేడు: బాలుడి హత్య

బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగింది. సాయికుమార్ (17) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న మృతుడి బంధువులు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
నగర అభివృద్ధిపై దృష్టి సారించాలి: KNR మున్సిపల్ ప్రత్యేక అధికారి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ తో పాటు వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం ఈ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ఆదాయ వ్యయాల అంచనా నివేదికలను కలెక్టర్ పరిశీలించారు. అధికారులు కరీంనగర్ నగర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.