News February 9, 2025
కాళేశ్వరంలో నేటి కార్యక్రమాల వివరాలు

కాళేశ్వరంలో మహా కుంభాభిషేకం వైభవంగా సాగుతోంది. చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఇప్పటికే తుని తపోవన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు కాళేశ్వరానికి చేరుకున్నారు. ప్రాత: సూక్త మంత్ర పఠనం, ప్రాత:కాల పూజలు, రుద్రహవనం, జయాదులు, బలిప్రధానము, మహా పూర్ణాహుతి, ఉం.10:42 నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి, మంత్ర పుష్పం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగములు అనంతరం మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది.
Similar News
News November 9, 2025
వైస్ కెప్టెన్సీ వల్లే T20 జట్టులో గిల్?

బ్యాటింగ్‌లో విఫలమవుతున్నా గిల్‌కు T20 జట్టులో చోటు కల్పిస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వైస్ కెప్టెన్‌గా ఉన్నందునే జట్టులో ఉంచుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జైస్వాల్, సంజూ మంచి ఫామ్‌లో ఉన్నా గిల్ కోసం వారిని బెంచ్‌కే పరిమితం చేస్తున్నారని అంటున్నారు. 19 T20ల్లో 136SRతో గిల్ 502రన్స్ చేశారు. అటు జైస్వాల్ 6 T20ల్లో 170SRతో 221, సంజూ 13 T20ల్లో 182SRతో 417 పరుగులు చేశారు.
News November 9, 2025
తుఫాను బీభత్సం.. 224కు చేరిన మృతుల సంఖ్య

ఫిలిప్పీన్స్‌లో కల్మేగీ తుఫాను మరణ మృదంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 224మంది మృతి చెందగా 109మంది గల్లంతయ్యారు. ఒక్క సెబూ ఐలాండ్‌లోనే వరదల వల్ల 158మంది చనిపోయారు. 526 మంది గాయపడగా 700 మందికి పైగా నిరాశ్రయులు అయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఆ దేశంలోని 53 కమ్యూనిటీస్‌లో ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఈ తుఫానును ఆ దేశ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ జాతీయ విపత్తుగా ప్రకటించారు.
News November 9, 2025
ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన జిల్లా వరంగల్: కవిత

తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా పాత్ర మరువలేనిదని, ఈ జిల్లా ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. హన్మకొండలోని కాళోజి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరంగల్ అనగానే తనకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గుర్తుకొస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాగృతి నేతలు పాల్గొన్నారు.


