News February 6, 2025

కాళేశ్వరంలో మూడు రోజులు ఆర్జిత సేవలు బంద్

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 7, 8, 9వ తేదీలలో మహా కుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో మూడు రోజుల ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ఈఓ మహేశ్ ప్రకటనలో పేర్కొన్నారు. మహాకుంభాభిషేక ఉత్సవాలకు వచ్చే భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకొని, అన్నప్రసాదం తీసుకోవాలని తెలిపారు. అలాగే మండలం మీదుగా నడిచే ఇసుక లారీలను 3 రోజులు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News March 17, 2026

రేపే దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం: మంత్రి మండిపల్లి

image

దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం కల్పించే “దివ్యాంగ శక్తి” పథకాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. మార్చి 18న ఉదయం 11:30 గంటలకు రాయచోటి RTC బస్ స్టాండ్‌లో కార్యక్రమం జరగనుంది. ఈ పథకం ద్వారా దివ్యాంగుల ఆత్మగౌరవం, స్వావలంబనకు బలం చేకూరుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమానికి దివ్యాంగులు, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

News March 17, 2026

అక్రమ కేసులకు భయపడం: కాకాణి

image

తప్పు చేసిన వారిని వదిలేసి, ప్రశ్నించే వారిని జైలుకు పంపుతారా? అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించారు. ఇసుక దోపిడీని ప్రశ్నించినందుకే ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కూటమి నేతలు చెప్పినట్లు అక్రమ అరెస్టులు చేస్తున్న అధికారులు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.

News March 17, 2026

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో DA హైక్?

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల DAను మార్చి చివరి లేదా ఏప్రిల్ తొలి వారంలో పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 58% DAను 60% లేదా 61%కి పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. AICPI డేటా ప్రకారం కనీసం 2% పెంపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. గత 3 నెలల బకాయిలు కూడా ఒకేసారి అందే అవకాశం ఉంది. దీనివల్ల ‘బేసిక్ పే’ను బట్టి నెలకు రూ.వేలల్లో జీతం పెరగనుంది.