News December 28, 2024

కాళేశ్వరంలో శని త్రయోదశి సందర్భంగా శని పూజల సందడి

image

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా భక్తులు భారీగా వచ్చి శని పూజలు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి గోదావరిలో స్నానాలు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయానికి వచ్చి శని పూజలు చేశారు. ఆ తర్వాత మళ్లీ గోదావరి నదిలో స్నానాలు చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.

Similar News

News January 22, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన గ్రామ, వార్డు సభలు. @ వెల్గటూర్ మండలంలో కారు, బైక్ డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ చొప్పదండిలో షార్ట్ సర్క్యూట్ తో 30 క్వింటాల్ల పత్తి దగ్ధం. @ కోనరావుపేట మండలంలో హనుమాన్ చాలీసా పారాయణం. @ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు. @ రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న మంత్రులు ఉత్తమ్, పొన్నం.

News January 21, 2025

సూరమ్మ ప్రాజెక్టును పరిశీలించిన ప్రభుత్వ విప్, సిరిసిల్ల కలెక్టర్

image

కథలాపూర్ మండలం కలిగోట గ్రామశివారులో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టును మంగళవారం సాయంత్రం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా పరిశీలించారు. బుధవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సూరమ్మ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో ముందస్తుగా ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు.

News January 21, 2025

రేపు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఉత్తమ్

image

రేపు నీటిపారుదల మరియు పౌర సరఫరాలశాఖ మంత్రి జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో నిర్వహించే గ్రామసభలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం గంగాధర మండలంలో నిర్వహించనున్న గ్రామసభ పాల్గొంటారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.