News April 6, 2025
కాళేశ్వరంలో 20 అడుగుల విగ్రహంతో వైభవం

కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతీ నది పుష్కరాలకు దేవాదాయశాఖ, ఇతర విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే రూ.25కోట్లు మంజూరు చేసింది. అలాగే ప్రధాన పుష్కర ఘాట్ వద్ద 20 అడుగుల ఎత్తులో సరస్వతి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. మహాబలిపురంలో ప్రత్యేకంగా తయారుచేయించి తెప్పిస్తున్నారు. మే 15న సూర్యోదయం నుంచి పుష్కరాలు ప్రారంభించేందుకు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి ముహుర్తం నిర్ణయించారు.
Similar News
News April 8, 2025
పవన్ కుమారుడికి గాయాలు.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు కావడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. కాగా మన్యం పర్యటన ముగించుకున్న పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి సింగపూర్ బయల్దేరనున్నారు. చిరంజీవి, సురేఖ దంపతులు సైతం సింగపూర్ బయల్దేరారు.
News April 8, 2025
అలంపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

అలంపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. స్థానికుల కథనం మేరకు.. అలంపూర్ మున్సిపాలిటీ సమీపంలో ఉన్న తుంగభద్ర నది వంతెన కింద గుర్తుతెలియని వ్యక్తి మృతి దేహం పడి ఉంది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడికి సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు.
News April 8, 2025
గద్వాల: ప్రతి గింజను కొనుగోలు చేయాలి: అదనపు కలెక్టర్

2024-25 యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల జిల్లా కలెక్టరేట్‌లో రబీ యాక్షన్ ప్లాన్‌పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేస్తామన్నారు.