News January 27, 2025
కాళేశ్వరం ఆలయ ఈఓ మారుతిపై వేటు

కాళేశ్వరం ఆలయంలో గత సోమవారం గర్భగుడి తలుపులు మూసేసి ప్రైవేట్ షూటింగ్ నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారి దుమారంలేపింది. భక్తులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆలయ ఈవో మారుతిపై వేటు వేస్తూ ఆలయ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ ఏడీసీ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News October 18, 2025
ధన త్రయోదశి: ఉప్పు కొంటున్నారా?

ధన త్రయోదశి నాడు ఉప్పుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇంట్లో వాస్తు దోషాలు తొలగి, ఆనందం, శ్రేయస్సు కలగడానికి ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయాలని పండితులు చెబుతున్నారు. ‘నేడు ఉప్పు కొనడం శుభప్రదం. ఇది సంతోషం, అదృష్టాన్ని తెస్తుంది. లక్ష్మీదేవి తన భక్తులకు తన ఆశీస్సులను కురిపిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు నీటిని చల్లడం పేదరికాన్ని, దుఃఖాన్ని దూరం చేస్తుంది’ అని సూచిస్తున్నారు.
News October 18, 2025
ఒంటిమిట్టకు తిరుమల లడ్డూలు

ఒంటిమిట్ట రామాలయానికి వచ్చే భక్తులకు 600 తిరుమల లడ్డూలు శనివారం అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారి నవీన్ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్కోటి రూ.50గా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పొందవచ్చన్నారు.
News October 18, 2025
సంగారెడ్డి: గురుకులాల్లో మిగుల సీట్ల భర్తీ

సంగారెడ్డి జిల్లాలోని అన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను 5 నుంచి 9వ తరగతి వరుకు గల ఖాళీలను భర్తీ చేయనున్నారు. విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాల ఇస్నాపూర్ హెచ్ఎం జయలక్ష్మి తెలిపారు. దరఖాస్తులను ఇస్నాపూర్ బాలికల పాఠశాలలో ఈ నెల 22 మధ్యాహ్నం లోపు అందజేయాలని సూచించారు.