News January 27, 2025

కాళేశ్వరం ఆలయ ఈఓ మారుతిపై వేటు

image

కాళేశ్వరం ఆలయంలో గత సోమవారం గర్భగుడి తలుపులు మూసేసి ప్రైవేట్ షూటింగ్ నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి దుమారంలేపింది. భక్తులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆలయ ఈవో మారుతిపై వేటు వేస్తూ ఆలయ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ ఏడీసీ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News February 18, 2025

కరీంనగర్: వ్యక్తిపై కొడవలితో దాడి.. తీవ్ర గాయాలు

image

హత్యాయత్నం చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన బత్తిని సాగర్ పై అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి భూసంబంధిత విషయంలో కొడవలితో దాడి చేయగా సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2025

కరీంనగర్: కాలువలో దూకి యువతి ఆత్మహత్యాయత్నం

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కాకతీయ కెనాల్ కాలువలోకి దూకి సోమవారం ఓ యువతి ఆత్మహత్యకు యత్నించిందని స్థానికులు తెలిపారు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి కాలువలో దూకి ఆ యువతిని కాపాడామన్నారు. ఆత్మహత్య యత్నించిన ఆమె కరీంనగర్‌లోని శ్రీనగర్ కాలనీకి చెందిన యువతికి గుర్తించామని తెలిపారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి తీసుకెళ్లారన్నారు. 

News February 18, 2025

చొప్పదండి: విండోను సందర్శించిన హిమాచల్ ప్రదేశ్ బృందం

image

చొప్పదండి సింగిల్ విండోను సోమవారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షుడు, అధికారుల బృందం సందర్శించింది. సొసైటీ పనితీరు, రైతులకు అందించే సేవలను పాలకవర్గం వారికి వివరించింది. సొసైటీ సభ్యులకు 10 శాతం డివిడెండ్ అందిస్తున్నామని, రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని తెలిపారు. వ్యవసాయ రుణాల రికవరీ 100 శాతం చేశామని, ఇతరు రుణాలు 85 శాతం వరకు రికవరీ చేశామని చెప్పారు.

error: Content is protected !!