News February 9, 2025
కాళేశ్వరం: త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్య స్నానాలు

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో 42 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేక మహోత్సవాలు ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు జరుగుతున్నాయి. కాగా, భక్తులు కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి, ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉ.10:42కు వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.
Similar News
News November 13, 2025
నెల్లూరు జిల్లా వాసికి కీలక పదవి

నెల్లూరు(D) విడవలూరుకు చెందిన సుమంత్ రెడ్డిని TTD ఢిల్లీ దేవాలయ స్థానిక సలహా కమిటీ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దేశ రాజధానిలోని ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ప్రతి వారం వేలాది మంది భక్తులను దర్శించుకుంటారు. ఇటీవలే సుమంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం సుమంత్ మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈయన నెల్లూరు DCMS ఛైర్మన్ గానూ పని చేశారు.
News November 13, 2025
కురుపాం ఘటన.. కేజీహెచ్‌లో NHRC విచారణ

కురుపాం గురుకులంలో జాండిస్ బారిన పడి బాలికలు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) బృందం గురువారం కేజీహెచ్‌లో విచారణ చేపట్టింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ఈ సందర్భంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ వైద్య సేవల వివరాలు, పరీక్షల నివేదికలు, తీసుకున్న జాగ్రత్తలు బృందానికి వివరించారు. కాగా నిన్న కురుపాం పాఠశాలను ఈ బృందం సందర్శించింది.
News November 13, 2025
HYD: రాబోయే రోజుల్లో చెమట సుక్కలే..!

ఏటా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. మహానగరంలో నిర్మాణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. కాంక్రీట్ జంగల్‌గా మారుతుంది. ఈ నేపథ్యంలో గత పదేళ్ల రిపోర్టును పరిశీలించిన అధికారులు రాబోయే రోజుల్లో 47, 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో నమోదైనా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు.


