News February 9, 2025
కాళేశ్వరం: త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్య స్నానాలు

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో 42 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేక మహోత్సవాలు ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు జరుగుతున్నాయి. కాగా, భక్తులు కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి, ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉ.10:42కు వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.
Similar News
News February 14, 2026
బండి సంజయ్ సమక్షంలో మరిన్ని చేరికలు? బీజేపీ దూకుడు!

కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ బలం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే 35 సంఖ్యకు చేరుకున్న పార్టీ వైపు మరికొందరు కార్పొరేటర్లు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే వారు కాషాయ కండువా కప్పుకుని పార్టీలో చేరే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. చేరికలు కొనసాగితే కార్పొరేషన్‌లో బీజేపీ ఆధిక్యం మరింత బలపడనుంది.
News February 14, 2026
తిరుపతి: ‘పుష్ప’లకు ఫారెస్ట్ యాక్ట్-60తో చెక్.!

ఎర్రచందనం అక్రమ రవాణాలో నేరస్తులపై RSASTF కఠినంగా వ్యవహరించనుంది. ఇందులో భాగంగా ఫారెస్ట్ యాక్ట్-60 ప్రకారం ప్రాపర్టీ సీజ్ అమలు చేయాలనే ఆలోచన చేస్తుంది. దీని ద్వారా నిందితుడు.. ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా ఆస్తులు సంపాదించారని DSP స్థాయి అధికారితో విచారణ చేయించి న్యాయపరమైన అంశాలతో నివేదిక సిద్ధం చేస్తారు. నేరం రుజువైతే అతని ప్రాపర్టీ సీజ్ చేయడంతో పాటు ఏడాది పాటు జైలు శిక్ష పడననుంది.
News February 14, 2026
MBNR: మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో కాంగ్రెస్!

ఉమ్మడి MBNR జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. MBNR కార్పొరేషన్, GWL, NRPT, అమరచింత, దేవరకద్ర, ALP మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. 11 మున్సిపాలిటీలలో ఛైర్మన్‌లను హస్తగతం చేసుకొని కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌కు అడుగుదూరంలో ఉన్న పాలమూరు కార్పొరేషన్, దేవరకద్ర మున్సిపాలిటీ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది. ఈసారి BRSకు చేదుఅనుభవమే ఎదురైంది.


