News February 9, 2025

కాళేశ్వరం: త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్య స్నానాలు

image

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో 42 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేక మహోత్సవాలు ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు జరుగుతున్నాయి. కాగా, భక్తులు కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి, ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉ.10:42కు వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.

Similar News

News February 8, 2026

వారంలో భారీగా తగ్గిన ధరలు

image

గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో ఈ నెల 1-7 వరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.3,980 తగ్గి రూ.1,56,600కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.3,650 తగ్గి రూ.1,43,550గా ఉంది. అటు కేజీ వెండి ధర ఫిబ్రవరి 1న రూ.3.20 లక్షలుగా ఉండగా నిన్నటి వరకు రూ.2.85 లక్షలకు చేరింది. వారంలోనే ఏకంగా రూ.35వేలు తగ్గింది. రాబోయే రోజుల్లో ఇదే పతనం కొనసాగనుందని సమాచారం.

News February 8, 2026

తిరుపతి జిల్లాలో కోడి ధర KG రూ.140

image

చికెన్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తిరుపతి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.132 నుంచి రూ.140 వరకు ఉంది. మాంసం రూ.191 నుంచి రూ. 216లకు చేరింది. స్కిన్ లెస్ రూ.218-రూ.240ల వరకు విక్రయిస్తున్నారు. 12 కోడిగుడ్ల ధర రూ. 75గా ధర పలుకుతోంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 8, 2026

VZM: విద్యుత్ సమస్యలు ఉన్నాయా?

image

విద్యుత్ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఏపీఈపీడీసీఎల్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ఈనెల 9 నుంచి ప్రారంభిస్తున్నట్లు సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ శనివారం తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు విశాఖలోని కార్పొరేట్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విజయనగరం, మన్యం జిల్లాలకు చెందిన వినియోగదారులు 8688400499 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు అన్నారు.