News August 19, 2024
కాళేశ్వరం: మేడిగడ్డకు స్వల్పంగా పెరిగిన వరద
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం 1,57,690 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ప్రస్తుతం 2,12,030 క్యూసెక్కులకు పెరిగింది. అధికారులు 85 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.
Similar News
News September 7, 2024
పెద్దపల్లిలో ప్రైవేట్ ఆంబులెన్సుల దందా!
పెద్దపల్లి జిల్లాలోని ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల దందా రోజురోజుకూ పెరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆంబులెన్సులు 6, ప్రైవేట్ అంబులెన్సులు 36 వరకు ఉన్నాయి. అయితే పేషెంట్లు చెప్పిన ఆసుపత్రులకు కాకుండా తమకు కమిషన్లు ఇచ్చే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. పైగా రవాణా చార్జీలు విపరీతంగా తీసుకుంటున్నారని, అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
News September 7, 2024
కరీంనగర్: ప్రేమ పెళ్లి పేరుతో మోసం.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకుని రెండుసార్లు అబార్షన్ చేయించి తనను మోసం చేశాడని కరీంనగర్ మండలానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మండలానికి చెందిన ఓ యువకుడు.. తనకు రెండుసార్లు అబార్షన్ చేయించాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 7, 2024
KNR: బంతి, చామంతి పూలకు భలే గిరాకి.. కిలో రూ.200
వినాయక చవితిని పురస్కరించుకొని కరీంనగర్లో మార్కెట్లో బంతి, చామంతి పూల రేట్లను అమాంతంగా పెంచేశారు. మామూలు రోజుల్లో కిలోకు రూ.50 ఉండే బంతి పూలకు రూ.100, చామంతి పూలకు రూ.200, గులాబీ పూలకు రూ.250-300 వరకు అమ్ముతున్నాయి. కరీంనగర్ మార్కెట్లో భారీగా కొనుగోలుదారులు, వినాయక మండపాల నిర్వాహకులు బారులు తీరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.