News January 27, 2025
కాళేశ్వరాలయ నూతన ఈఓగా మహేశ్ బాధ్యతలు

కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయం నూతన ఈఓగా మహేశ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు రెగ్యులర్ కార్యనిర్వహణాధికారిగా ఆయన పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం పలువురు సిబ్బంది, అర్చకులు నూతన ఈవోకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 14, 2025
రిటర్నింగ్ అధికారుల విధులు చాలా కీలకం: డీపీవో

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఆర్వో, సహాయ రిటర్నింగ్ అధికారుల విధులు చాలా కీలకమని జిల్లా పంచాయతి అధికారి నారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి, కాటారం డివిజన్లకు సంబంధించిన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
News February 14, 2025
రెసిప్రోకల్ సుంకాలను వసూలు చేస్తాం: ట్రంప్

ఇతర దేశాల నుంచి రెసిప్రోకల్ (పరస్పర) సుంకాలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. US నుంచి ఆయా దేశాలు ఎంత వసూలు చేస్తే తామూ అంతే వసూలు చేస్తామని వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎక్కువ టారిఫ్స్ వసూలు చేస్తోందని తెలిపారు. తాము కూడా భారత్ నుంచి అంతే వసూలు చేస్తున్నామని చెప్పారు.
News February 14, 2025
బిచ్కుంద: బస్టాండ్ ఆవరణలో వ్యక్తి మృతి

బిచ్కుంద బస్టాండ్ ఆవరణలో పుల్కల్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అక్కడికి చేరుకుని పరిశీలించి చూడగా మద్యం సేవించి ఉన్న సమయంలో ఫిట్స్ వచ్చాయని స్థానికులు చెప్పినట్లు పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.