News February 9, 2025

కాళేశ్వర క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక

image

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్రణాళిక రూపొందించి నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, MLA గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. కాశీ, కేదార్‌నాథ్ కంటే ఈ క్షేత్రం ప్రాశస్త్యం కలదిగా పురాణాలు చెబుతున్నాయన్నారు.

Similar News

News March 16, 2026

వరంగల్ నిరుద్యోగ సమస్యపై పార్లమెంట్‌లో ఎంపీ కావ్య

image

వరంగల్ జిల్లాలో పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధి కోసం యువత ఇతర నగరాలకు వలస వెళ్తున్న అంశాన్ని ఎంపీ కడియం కావ్య పార్లమెంట్‌లో ప్రస్తావించారు. పరిశ్రమల కొరత వల్ల స్థానికంగా ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలంగాణలో యువత నిరుద్యోగం తగ్గిందని తెలిపారు.

News March 16, 2026

మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ కన్నుమూత

image

TG: ఉమ్మడి ఆదిలాబాద్(D) ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద్ నాయక్(71) అనారోగ్యంతో మృతిచెందారు. దండేపల్లి(M) లింగాపూర్‌లోని తన స్వగృహంలో ఈరోజు తుది శ్వాస విడిచారు. గోవింద్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి సారి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా(1985) గెలుపొందిన ఆయన, ఆ తర్వాత TDP(1994), BRS(2004) నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

News March 16, 2026

కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత లేదు: JC

image

కర్నూలు జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 11వేల సిలిండర్లు నిల్వలో ఉండగా, అదనంగా 7వేల సిలిండర్లు చేరుకున్నాయన్నారు. ప్రతిరోజు సగటున 10వేల సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ జరుగుతోందన్నారు. గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఏజెన్సీలు ఇబ్బందులు కలిగిస్తే 1967 టోల్ ఫ్రీ నంబర్‌‌ను సంప్రదించాలన్నారు.