News November 10, 2024
కావలికి శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు రాక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు ఆదివారం కావలి పట్టణానికి విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి కావలి పట్టణంలోని మినీ స్టేడియాన్ని సందర్శిస్తారు. తదుపరి స్థానిక ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
Similar News
News October 21, 2025
కావలిలో రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

కావలిలోని బుడంగుంట రైల్వే గేటు సమీపంలో మంగళవారం రైలు కిందపడి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. రైలు పట్టాలపై మహిళ మృతదేహం పడి ఉండడాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలికి సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, మృతురాలు పూర్తి వివరాలు తెలియాల్సింది.
News October 21, 2025
కందుకూరులో పోలీసులు అతి: YCP

కందుకూరులో పోలీసులు చాలా అతి చేస్తున్నారని YCP మండిపడింది. ‘TDPగూండాల చేతిలో దారుణ హత్యకి గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న YCP నేత అంబటి మురళిని పోలీసులు అడ్డుకున్నారు. నిందితులు టీడీపీ నేతలే కావడంతో ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయట్లేదు. అఖరికి పరామర్శకు సైతం దూరం చేస్తూ కాపులపై కక్ష సాధిస్తున్నావా చంద్రబాబు’ అని వైసీపీ ప్రశ్నించింది.
News October 21, 2025
VSUలో కరెంట్ కట్.. విద్యార్థులకు సెలవు

కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ(VSU) గర్ల్స్ హాస్టల్లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వర్సిటీ అధికారులు స్పందించి ఆడిటోరియం, ఏయూ బిల్డింగ్ ఇతర ప్రాంతాల్లో వసతి కల్పించారు. కరెంట్ లేకపోవడంతో మంగళవారం సెలవు ప్రకటించారు. ఇవాళ ఉదయం మెకానిక్‌లను పిలిపించి సరఫరా పునరుద్ధరించారు. జనరేటర్ లేకపోవడంపై విమర్శలు వచ్చాయి.