News November 2, 2024

కావలిలో ఉద్రిక్తత

image

కావలిలో ప్రయాణికుడిపై డ్రైవర్ చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. లాజర్ అనే ప్రయాణికుడు మద్యం తాగి బస్సు ఎక్కే ప్రయత్నం చేయగా డ్రైవర్ అడ్డుకున్నాడు. తాగి బస్సు ఎక్కకూడదని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో డ్రైవర్ తనను కొట్టడంతో పన్ను విరిగి నోటి నిండా రక్తస్రావమైందని లాజర్ ఆరోపించారు. ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించారు. పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News December 2, 2024

రేపు సూళ్లూరుపేటకు జిల్లా కలెక్టర్ రాక

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా,సూళ్లూరుపేటలో రేపు ఉదయం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన హాజరై ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News December 1, 2024

కొండాపురం: హత్య చేసిన నిందితుడు అరెస్ట్

image

కొండాపురం మండలం గానుగపెంటలో బంకా తిరుపాలు అనే మేకల కాపరిని హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ శ్రీధర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. గానుగపెంటలో బుధవారం బాంకా తిరుపాలు హత్యకు గురయ్యాడు. పశువులు కాస్తున్న మాల్యాద్రి(మల్లి) ఈ హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. తిరుపాలుకు చెందిన మేకలను అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని ఆశతోనే ఈ హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

News December 1, 2024

నెల్లూరు జిల్లాలో పలు బస్సులు రద్దు

image

నెల్లూరు జిల్లాలో భారీవర్షాల నేపథ్యంలో పలు బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు రీజియన్ పరిధిలో ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు నుంచి చెన్నైకు ప్రతి రోజూ 18 బస్సులు నడుస్తుండగా వాటిని రద్దు చేశామన్నారు. మరోవైపు కావలి నుంచి తుమ్ములపెంట దారిలో కాలువకు గండి పడటంతో ఆ దారిలో వెళ్లే బస్సులను సైతం రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.