News February 22, 2025

కావలిలో బాలికను వేధించిన నిందితుడికి జీవిత ఖైదు

image

బాలికను వేధించిన కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.27వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు జిల్లా పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్చునిచ్చారు. కావలిలోని ఓ బట్టల షాపులో పనిచేసే బాలికకు సాయి కిషోర్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలిశాడు. అనంతరం దారుణంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు కావలి పోలీసులకు 2017లో ఫిర్యాదు చేశారు. కేసు విచారించి జడ్జి శిక్ష ఖరారు చేశారు.

Similar News

News December 16, 2025

మామా.. మన నెల్లూరును మనమే క్లీన్ చేసుకుందాం..!

image

నెల్లూరులో పదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి వ్యాపారాన్ని స్థానికుల సమాచారంతో పోలీసులు అడ్డుకున్నారు. సిటీలో గంజాయి నిర్మూలనకు యువత ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఎక్కడన్నా గంజాయి వ్యాపారాలు సాగుతుంటే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నగదు సైతం ఇస్తామని ప్రకటించారు. యువత గంజాయి వాడకానికి దూరంగా ఉంటే క్రైం తగ్గుతుందని పోలీసులు పేర్కొన్నారు. మీ COMMENT.

News December 16, 2025

ఈనెల 19న ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌ డే: కలెక్టర్‌

image

ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌ డే కార్యక్రమాన్ని ఈనెల 19న మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతినెలా మూడో శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌ డేను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News December 16, 2025

నెల్లూరులో మరో లేడీ డాన్.. ఇకపై వివరాలు చెబితే ప్రైజ్ .!

image

నెల్లూరులో పదేళ్లుగా గంజాయి అమ్ముతున్న షేక్ ముంతాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు DSP ఘట్టమనేని తెలిపారు. స్థానికుల సమాచారంతో దాడులు చేయగా నిందితురాలి ఇంటిలో 20.90కిలోల గంజాయి లభ్యం అయిందన్నారు. దీంతో ఆమెతోపాటు కుమారులు సిరాజ్, జమీర్, కోడలు సుభాషిణితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. యువత ఇలాగే సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటూ నగదు రివార్డ్ ఇస్తామని DSP పేర్కొన్నారు.