News April 12, 2025

కావలిలో మోసం

image

కావలిలో మరో మోసం వెలుగు చూసింది. కలిగిరికి చెందిన ఓవ్యక్తి పాతూరు శివాలయం వద్ద నాలుగేళ్లుగా ఉంటూ ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తున్నాడు. ముందుగా ఒక్కొక్కరి నుంచి రూ.50వేలు తీసుకుని నెలకు రూ.7వేలు చొప్పున వాళ్లకు ఇచ్చి నమ్మించాడు. ఆ తర్వాత రూ.2కోట్ల వరకు వసూళ్లు చేసి రూ.లక్షకు రూ.14 వేల చొప్పున ఫిబ్రవరి వరకు ఇచ్చాడు. ఆ తర్వాత ఫోన్ లిప్ట్ చేయలేదు. ఇంటికి సైతం తాళం వేసి ఉండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

Similar News

News February 27, 2026

చెవులు మూసుకుని నెల్లూరు MLC నిరసన

image

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై చర్చించాలని శాసనమండలిలో వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వారంతా మండలిలో కింద కూర్చొని ఆందోళన చేశారు. నెల్లూరుకు చెందిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెవులు మూసుకుని, ఇతర MLCలు కళ్లు, నోరు మూసుకుని తమ నిరసన తెలిపారు.

News February 27, 2026

నెల్లూరు DPO కీలక ఆదేశాలు

image

నెల్లూరు జిల్లాలోని పంచాయతీల్లో 100% ఇంటి పన్నులను సెక్రటరీలు వసూలు చేయాలని DPO వసుమతి ఆదేశించారు. జిల్లాలో మార్చి నెలాఖరు నాటికి పన్నులు వసూలు చేయాలని చెప్పారు. పాదలకూరు, కోవూరు, వింజమూరు, రాపూరు పంచాయతీల్లో పన్నులు భారీగా పేరుకుపోయాయని తెలిపారు. వీటిని రాబట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు.

News February 27, 2026

నెల్లూరు: కిడ్నాప్.. తల లేకుండా డెడ్‌బాడీ లభ్యం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో యువకుడి మృతి కలకలం రేపింది. ముస్లిం వీధికి చెందిన ఉస్మాన్ ఓ హిజ్రాతో సన్నిహితంగా ఉండేవాడు. ఆమెకు చెందిన కొంత బంగారాన్ని అతని అన్న హుస్సేన్(33) తాకట్టు పెట్టి నగదు వాడుకున్నాడు. దీంతో ఆ హిజ్రా మరికొందరితో వచ్చి హుస్సేన్‌ను ఆటోలో తీసుకెళ్లి కిడ్నాప్ చేసింది. ఏమైందో ఏమో గురువారం పండ్లూరు వద్ద రైల్వే పట్టాలపై తల లేని మొండెంగా హుస్సేన్ డెడ్‌బాడీ దొరికింది.