News April 12, 2025
కావలిలో మోసం

కావలిలో మరో మోసం వెలుగు చూసింది. కలిగిరికి చెందిన ఓవ్యక్తి పాతూరు శివాలయం వద్ద నాలుగేళ్లుగా ఉంటూ ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నాడు. ముందుగా ఒక్కొక్కరి నుంచి రూ.50వేలు తీసుకుని నెలకు రూ.7వేలు చొప్పున వాళ్లకు ఇచ్చి నమ్మించాడు. ఆ తర్వాత రూ.2కోట్ల వరకు వసూళ్లు చేసి రూ.లక్షకు రూ.14 వేల చొప్పున ఫిబ్రవరి వరకు ఇచ్చాడు. ఆ తర్వాత ఫోన్ లిప్ట్ చేయలేదు. ఇంటికి సైతం తాళం వేసి ఉండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
Similar News
News April 18, 2025
నెల్లూరు: ప్రజలకు ఈకేవైసీ కష్టాలు

రేషన్ కార్డుదారులకు మరోసారి ఈకేవైసీ కష్టాలు వచ్చాయి. గతంలో ఈకేవైసీని వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. సరిగా వేలిముద్రలు పడని వారివి ప్రస్తుతం పెండింగ్ చూపిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీలోనూ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పిల్లలు, పెద్దలకు ఈకేవైసీ పూర్తిచేయాలని భావించింది. పొదలకూరు మండలంలోనే 6,125 మందికి ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్లు సివిల్ సఫ్లై డీటీ రవికుమార్ తెలిపారు.
News April 18, 2025
ICDS నెల్లూరు PDగా సువర్ణ బాధ్యతల స్వీకరణ

నెల్లూరు జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్) ప్రాజెక్ట్ డైరెక్టర్గా సువర్ణ బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో పీడీగా విధులు నిర్వహిస్తున్న సుశీల అనారోగ్యంతో సెలవుపై వెళ్లారు. ఇన్ఛార్జ్ పీడీగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కొనసాగుతున్నారు. దీంతో సువర్ణను రెగ్యులర్ పీడీగా నియమించారు.
News April 18, 2025
నెల్లూరులోనూ వెయ్యేళ్ల నాటి కట్టడాలు

నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం అతి పురాతనమైంది. దీనిని క్రీ.శ 7, 8వ శతాబ్దంలోనే సింహపురిని ఏలిన పల్లవ రాజులు దీనిని నిర్మించారు. ఆ తర్వాత రాజరాజనరేంద్రుడు, కుళోత్తుంగ చోళుడు దీనిని అభివృద్ధి చేశారు. 95 అడుగుల పొడవుతో ఆలయ గాలిగోపురం ఉండటం విశేషం. అలాగే ఉదయగిరి కోటకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఇలాంటి కట్టడాలు నెల్లూరు జిల్లాలో చాలా ఉన్నాయి. నేడు World Heritage Day.