News October 1, 2024
కావలిలో రోడ్డు ప్రమాదం.. ప్రకాశం విద్యార్థిని మృతి

ప్రకాశం(D) పొన్నలూరు (M) చెరుకూరుకు చెందిన కృపాకర్, మైథిలి అనే ఇద్దరు సోమవారం ఒంగోలు నుంచి నెల్లూరుకు స్కూటీపై వెళ్తుండగా కావలి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి నెల్లూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మైథిలి మృతి చెందింది. కృపాకర్కి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలు పదో తరగతి చదువుతోంది. కావలి రూరల్ SI బాజీ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 4, 2025
సర్వర్ మొరాయింపుతో కౌశలం స్కిల్ టెస్టుకు అడ్డంకి.!

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వేదికగా నిర్వహిస్తున్న కౌశలం (కౌన్సిలింగ్) సర్వేకు సంబంధించిన ఆన్లైన్ స్కిల్ టెస్ట్ ప్రక్రియ సర్వర్ సమస్యల కారణంగా తీవ్ర అంతరాయానికి గురైంది. జిల్లాలోని పలు సచివాలయ కేంద్రాలలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష కోసం హాజరైన అభ్యర్థులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
News December 4, 2025
కొత్త ఏడాదిలోనే మార్కాపురం జిల్లా..!

నూతన సంవత్సరం వస్తూ వస్తూ.. మార్కాపురం డివిజన్ ప్రజల కలను నెరవేరుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు జిల్లా ప్రకటనకు పచ్చజెండా ఊపారు. అయితే ఈనెల 30 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు గడువు ఉంది. దీనిని బట్టి 2026 రావడంతోనే, కొత్త జిల్లా అధికారిక ప్రకటన రానుంది. 2026 జనవరి 1 రోజే అధికారిక ఉత్తర్వులు రావచ్చని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద కొత్త ఏడాది కొత్త కబుర్లు తీసుకురానుందని ప్రజలు అంటున్నారు.
News December 4, 2025
పోక్సో కేసులను త్వరితగతిన విచారించండి: SP

పోక్సో కేసులను త్వరితగతిన విచారించి పూర్తి చేయాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన గురువారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి లోపం కనిపించకూడదన్నారు. గంజాయి వంటి మత్తుపదార్థాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలన్నారు.


