News October 1, 2024
కావలిలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థిని మృతి

కావలి పరిధిలోని హైవేపై మద్దూరుపాడు ఆర్కే దాబా వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కృపాకర్, మైథిలి అనే ఇద్దరు ఒంగోలు నుంచి నెల్లూరుకు స్కూటీపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. నెల్లూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మైథిలి మృతి చెందింది. కృపాకర్కి తీవ్రగాయాలయ్యాయి. వీరిది ప్రకాశం(జి) పొన్నలూరు(M) చెరుకూరు గ్రామం. మృతురాలు పదో తరగతి చదువుతోంది. కావలి రూరల్ SI బాజీ బాబు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 13, 2025
జగన్తో మాజీ మంత్రి అనిల్ భేటీ

తాడేపల్లిలో YCP అధినేత జగన్ను ఆయన నివాసంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా వారు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. నాయకులు, నేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై మరింతగా ముందుకు వెళ్లాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.
News November 13, 2025
నెల్లూరు: ఆటో డ్రైవర్ల మానవత్వం.. ఒంటరి యువతికి ఆశ్రయం

యువతి ఒంటరిగా కనిపిస్తే అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గులున్న ఈ సమాజంలో విజయవాడ ఆటోడ్రైవర్లు మానవత్వం చూపించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో మానసిక వేదనకు గురై నెల్లూరు నుంచి విజయవాడ చేరుకుని యువతికి అండగా నిలిచారు. పర్సు పొగొట్టుకుని, ఫోన్, డబ్బుల్లేక బస్టాండ్లో ఆకలితో అలమటిస్తున్న ఆమెకి అండగా నిలిచారు. పోలీసులకు సమాచారమిచ్చి ఆమెను సురక్షిత కేంద్రానికి చేర్చిన ఆటో వాలాలపై అభినందనలు వస్తున్నాయి.
News November 13, 2025
నెల్లూరు: సాయం కోసం 12,293 మంది రైతుల ఎదురుచూపులు

అన్నదాత సుఖీభవ కింద ఖాతాలకు జమ కావలసిన రూ.20 వేల కోసం నెల్లూరు జిల్లాలోని 12,293 మంది రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 2 లక్షల మందికి పైగా రైతులకు జమ అయింది. కానీ సాంకేతిక కారణాలతో జమ కాని 12,293 మంది రైతులు సాయం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు వివాదాల కారణంగా ఆగినవి కాకుండా మిగిలిన అన్నీ కూడా అధికారులు తగిన శ్రద్ధ చూపిస్తే సత్వరమే పరిష్కారం అయ్యేవేనని సమాచారం..


