News June 2, 2024

కావలిలో విషాదం.. గంటల వ్యవధిలో దంపతుల మృతి

image

భార్య మరణం తట్టుకోలేక భర్త కూడా మరణించిన ఘటన కావలి పట్టణంలో చోటు చేసుకుంది. కావలి పట్టణం వైకుంఠాపురం అనపగుంత సమీపంలో నివాసం ఉంటున్న గంటా శ్రీనివాసరావు(71) వరలక్ష్మి (65)భార్య భర్తలు. జ్వరంతో బాధపడుతూ వరలక్ష్మి మృతి చెందగా ఆమె మరణ వార్తను తట్టుకోలేక భర్త శ్రీనివాసరావు కూడా మృతిచెందాడు. ఈ దంపతుల మృతదేహాలు పక్కపక్కనబెట్టి ఉండడం చూసి పలువురు కంటతడి పెట్టారు.

Similar News

News November 12, 2025

రేపే నెల్లూరుకు ఫుడ్ కమిషన్ సభ్యుడి రాక

image

రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు నెల్లూరు జిల్లాలో ఈనెల 13, 14న పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీడీఎస్‌ షాప్స్, ఐసీడీఎస్‌, మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేస్తారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష చేస్తారు.

News November 12, 2025

నెల్లూరు: ఆక్వా రైతులకు గమనిక

image

ఆక్వా రైతులందరికీ విద్యుత్తు బిల్లుల్లో రాయితీ ఇస్తామని నెల్లూరు RDO అనూష ప్రకటించారు. రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి అథారిటీ చట్టం-2020 ద్వారా అనుమతులు పొందిన వాళ్లే అర్హులన్నారు. రొయ్యలు, చేపల చెరువుల రైతులు సచివాలయంలో రూ.1000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, పాస్ బుక్, ఆటో క్యాడ్ మ్యాప్, ప్రాజెక్ట్ రిపోర్ట్, మీటర్ నంబర్, వాల్టా చట్టం అఫిడవిట్ పేపర్లు అవసరమని చెప్పారు.

News November 12, 2025

HYD ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు.. నెల్లూరు వాసి అరెస్ట్

image

ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో CISF అధికారులు అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు చేపట్టారు. అబుదాబీ నుంచి HYD వచ్చిన నెల్లూరు వాసి జయరాం సూర్యప్రకాశ్, చెన్నై వాసి మహమ్మద్ జహంగీర్‌ లగేజీలను చెక్ చేయగా సుమారు రూ.2 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించారు. 8 డ్రోన్లు, 65 ఐఫోన్లు, 50 ఐవాచ్‌లు, 4 వీడియో గేమ్స్ పరికరాలు, డ్రోన్స్‌ను సీజ్ చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు.