News August 24, 2024

కావలి: ఆర్టీసీలో రూ.10 నాణెం చెల్లుతుంది

image

నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ రూ.10 కాయిన్‌ను కొన్ని చోట్ల తీసుకోవడం లేదు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లోనూ వీటిని తీసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కావలి డిపో మేనేజర్ శ్రీనివాసరావు స్పందించారు. ‘ఆర్టీసీలో రూ.10 కాయిన్ చెల్లుతుంది. ప్రయాణికులు ఇచ్చే కాయిన్ తీసుకోవాల్సిందేనని సిబ్బందికి ప్రత్యేకంగా చెప్పాం. రూ.10 కాయిన్ చెల్లుతుందని బస్టాండ్ ఆవరణలో నోటీసు బోర్డు పెట్టాం’ అని తెలిపారు.

Similar News

News November 23, 2025

పెన్నానది ఐలాండ్లో 12 మంది అరెస్ట్

image

ఇందుకూరుపేట(M) కుడితిపాలెం సమీపంలోని పెన్నా నది ఐలాండ్‌లో పేకాటాడుతున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. SP అజిత పర్యవేక్షణలో రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాస్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులు చేపట్టారు. డ్రోన్ కెమెరా ద్వారా పేకాట రాయుళ్ల కదలికలను పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3లక్షల నగదు, 3కార్లు, 6 బైక్‌లు, 14 ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు.

News November 23, 2025

నెల్లూరు: ZP సీఈవోగా శ్రీధర్ రెడ్డి బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా ఎల్.శ్రీధర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా పంచాయతీ అధికారిగా ఉంటూ జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.