News August 24, 2024
కావలి: ఆర్టీసీలో రూ.10 నాణెం చెల్లుతుంది

నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ రూ.10 కాయిన్‌ను కొన్ని చోట్ల తీసుకోవడం లేదు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లోనూ వీటిని తీసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కావలి డిపో మేనేజర్ శ్రీనివాసరావు స్పందించారు. ‘ఆర్టీసీలో రూ.10 కాయిన్ చెల్లుతుంది. ప్రయాణికులు ఇచ్చే కాయిన్ తీసుకోవాల్సిందేనని సిబ్బందికి ప్రత్యేకంగా చెప్పాం. రూ.10 కాయిన్ చెల్లుతుందని బస్టాండ్ ఆవరణలో నోటీసు బోర్డు పెట్టాం’ అని తెలిపారు.
Similar News
News January 21, 2026
మనుబోలు: రైలు పట్టాల సమీపంలో శవం

మనుబోలు మండలం కొమ్మలపూడి, వెంకటాచలం రైల్వే స్టేషన్ల మధ్య 157/08_10 వద్ద పట్టాల సమీపంలో ఓ మృతదేహాన్ని రైల్వే పోలీసులు బుధవారం గుర్తించారు. సహజంగా మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. బ్రౌన్ కలర్ ఫుల్ హాండ్స్ స్వెటర్, ఎరుపు, తెలుపు గీతల చొక్కా, పాచి కలర్ టీషర్ట్, స్కై బ్లూ బనియన్, నలుపు రంగు జీన్స్ ధరించి ఉన్నాడని రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు.
News January 21, 2026
తిరుమలలో ఆ దర్శనాలన్నీ రద్దు

రథసప్తమి రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో పలు దర్శన సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, ఎన్‌ఆర్‌ఐ, చంటి బిడ్డలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేశారు.
News January 21, 2026
నెల్లూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

నెల్లూరు జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై సంబంధిత శాఖ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని జిల్లాలో పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న స్కానింగ్ సెంటర్ల విషయంలో దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని సూచించారు.


